Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అందాలతార అరుదెంచె నాకై


    • 1. అందాలతార అరుదెంచె నాకై - అంబర వీధిలో
    • అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
    • ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
    • ఆది దేవుని జూడ - అశింపమనసు - పయనమైతిమి ll అంll

    • 2. విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
    • వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
    • విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
    • విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ ll అంll

    • 3. యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు
    • ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
    • ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
    • ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకుll అంll

    • 4. ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే 
    • బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
    • ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
    • బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన ll అంll