Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆదరణ లేని నా పైన


    • ఆదరణ లేని నా పైన నీవు ఎనలేని ప్రేమను కుమ్మరించినవా 
    • ఆశ్రయమేలేని నా గృహముకు నీవు ఆదరించి మమ్ములను నడిపించితివా 

    • నీ కృప ఎంతో ఉన్నతమైనది 
    • నీ ప్రేమ మమ్ములను దర్శించుచున్నది

    • ఎందరో నన్ను తృణీకరించినను నీవు ఎన్నడు త్రోసి వేయలేదయ్యా తృణీకరింపబడిన నన్ను ఆశ్రయముగా మార్చి
    •  ఊహించని మేళ్లతో ఆశీర్వదించావు

    • నీ కృప ఎంతో ఉన్నతమైనది 
    • నీ ప్రేమ మమ్ములను దర్శించుచున్నది

    • లోక పాపములో బానిసగా నేనుండగా నీ వాక్యము ద్వారా నన్ను రక్షించావు 
    • బానిసగా ఉన్నచోటనే సాక్షిగా మార్చావు 
    • అనేకులను మార్చుటకు అధికారము నిచ్చావు

    • నీ కృప ఎంతో ఉన్నతమైనది 
    • నీ ప్రేమ మమ్ములను దర్శించుచున్నది

    • నీ ప్రేమా నీ కృపా నాకు సమృద్ధి నిచ్చెనయ్యా అ ఆ ఆ 
    • నీ ప్రేమా నీ కృపా నన్ను జీవింప చేసేనయ్యా ఆ ఆ

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 37 times