Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Naa Jeevitha Bhaagasvamivi neevu | నా జీవిత భాగస్వామివి నీవు


    • నా జీవిత భాగస్వామివి నీవు
    • నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు } 2
    • నాకే సమృద్దిగా నీ కృపను పంచావు
    • నా యేసురాజ కృపాసాగరా అనంతస్తోత్రార్హుడా } 2

    • నీ దయగల కనుసైగలే ధైర్యపరచినవి
    • నీ అడుగుజాడలే నాకు త్రోవను చూపినవి } 2
    • నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి
    • నీ సైన్యములో నన్ను చేర్చితివి } 2|| నా జీవిత ||

    • నీ దయగల మాటలే చేరదీసినవి
    • నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి } 2
    • నీ కృపనే ధ్వజముగ నాపైన నిల్పితివి
    • నీ విందుశాలకు నను చేర్చితివి } 2|| నా జీవిత ||

    • నీ దయగల తలంపులే రూపునిచ్చినవి
    • నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి } 2
    • నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు
    • నీ అంతఃపురములో నను చేర్చుదువు|| నా జీవిత ||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 214 times