Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Entha Deenathi Deenamo | ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2)


    • ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2)
    • నీ జనన మెంత దయనీయమో
    • తలచుకుంటె నా గుండె తడబడి
    • కరిగి కరిగి నీరగుచున్నది

    • 1.నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చినా సత్రమయ్యా (2)
    • ఆ సత్రములో ఓ యేసయ్యా నీకు స్థలమే దొరకలేదయ్యా (2)   ||ఎంత||

    • 2.నిండు చూలాలు మరియమ్మ తల్లి నడువలేక సుడివడి పోయేనయ్యా (2)
    • దిక్కుతోచక ఓ యేసయ్యా పశువులపాకలో ప్రసవించెనయ్యా (2) ||ఎంత||

    • 3.చల్లగాలిలో చాటు లేక నలుమూలలా చలిపుట్టెనయ్యా (2)
    • పసికండువై ఓయేసయ్యా తల్లి ఒడిలో ఒదిగినావయ్యా (2)       ||ఎంత|
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 546 times