Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Karuninchavaa devaa | కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా


    • కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా 
    • నీ ప్రేమలోనే - కావుమా 
    • శ్రమలోన తోడే లేక -  శిలనైన కానే కాక 
    • వేసారిపోయా యేసయ్య 
    • పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా 
    • నా జీవ దాత యేసయ్య
    •  
    • 1. ఆశే నీవై నాలో  - నా జీవ గమనములోన 
    • దారే చూపే నాకు  - నీ వాక్య వెలుగులలోన 
    • నీలో నివాసమే  -  నాలోని కోరిక  
    • నీ స్నేహ బంధమే  - సంతోష కానుక     
    • నీలో నిరీక్షణే  - నా మౌన గీతిక 
    • కాలాలు మారినా  - నీవుంటే చాలిక
    •  
    • 2. ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా 
    • ధైర్యం నాలో నింపి  - నాతోటి నడచిన దేవా  
    • నీ సత్య మార్గమే   - నా జీవ బాటగా 
    • నీ నామ ధ్యానమే  - నాలోని శ్వాసగా
    • నీలోనే ఏకమై  - నీ ప్రేమ సాక్షినై  
    • సాగాలి యేసయ్య - నా జీవితాంతము
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 670 times