Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Jyothiga mamu Jeyumo | జ్యోతిగ మము జేయుమో


    • జ్యోతిగ మము జేయుమో దేవా యీ లోకమున నీ ఖ్యాతి నిలుపగ జేయుమో
    • దేవా జ్యోతిగ మము జేసి మాలో క్రీస్తు మార్గము బయలు పరచి నీతి
    • ప్రేమలతోడ హృదయము నింపి మమునడిపింపు మయ్యా ||జ్యోతిగ||

    • 1. మా కుటుంబము లోన నీ వెలుగు ప్రసరించు నట్లుగ నాదు బ్రదుకును
    • శుద్ధి జేయుమయ్యా మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు
    • జూపగ మమ్ము నీ మార్గంబునందున మనుప పరిశుద్ధాత్మ నిడుమా ||జ్యోతిగ||

    • 2. సంఘమున నీ కీర్తి కనపడగ పరిశుద్ధ సహవాసంబులో నను వృద్ధి
    • జేయు మయా భంగపరచెడి కక్షలన్నిటి బాధపరచెడి శక్తులన్నిటి పార
    • దోలగ శక్తినిడి నీ భక్తి కాంతిని జూపి నాలో ||జ్యోతిగ||

    • 3. నిన్ను దెలియని యాత్మ లెన్నెన్నో మా చుట్టునున్నవి నీ కొరకు
    • కనిపెట్టుచున్నవయా అన్నివేళల నీ సువార్తను అందరికి ప్రకటింప
    • మనసున నాశనిడి నీ వార్త వెలుగును అన్ని దిశలకు జాటునట్లుగ ||జ్యోతిగ||

    • 4. సమయమును వరముల నొసంగితివి మా రక్షకా ధన సంపదను నీవే
    • యొసంగితివి విమల జీవితమందు వానిని విరివిగా నితరుల కొసంగి వీర
    • త్యాగార్పణములతో నీ వెలుగు ప్రసరింపంగజేయను ||జ్యోతిగ||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 155 times