Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Nenante neekenduko ee prema | నేనంటే నీకెందుకో ఈ ప్రేమా


    • నేనంటే నీకెందుకో ఈ ప్రేమా
    • నన్ను మరచి పొవెందుకు (2)
    • నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా
    • నన్ను విడిచిపోవెందుకు
    • కష్టాలలో నష్టాలలో
    • వ్యాధులలో బాధలలో
    • కన్నీళ్ళలో కడగండ్లలో
    • వేదనలో శోధనలో
    • నా ప్రాణమైనావు నీవు
    • ప్రాణమా.. నా ప్రాణమా – (2) ||నేనంటే||

    • నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు
    • నిన్ను వీడిపోయినా – నన్ను వీడిపోలేవు (2)
    • ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4)
    • ఏ ఋణమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి
    • తాళలేను నీ ప్రేమను ||నేనంటే||

    • ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు
    • మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2)
    • ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4)
    • ఏ బలమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి
    • తాళలేను నీ ప్రేమను ||నేనంటే||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 677 times