Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Mahimatho nindina krupa | మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా


    • మహామహిమతో నిండిన కృపా సత్యసంపూర్ణుడా
    • ఇశ్రాయేలు స్తోత్రములపై ఆశీనుడా యేసయ్యా
    • నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా

    • మహిమను విడిచి భువిపైకి దిగివచ్చి - కరుణతో నను పిలిచి
    • సత్యమును బోధించి చీకటిని తొలగించి - వెలుగుతో నింపితివి
    • సదయుడవై నా పాదములు తొట్రిల్లనివ్వక
    • స్థిరపరచి నీ కృపాలో నడిపించువాడవు
    • ||మహామహిమతో||

    • కరములుచాచి జలరాసులలోనుండి - నను లేవనెత్తితివి
    • క్షేమమును దయచేసి నను వెంబడించి అనుదినము కాచితివి
    • అక్షయుడా ప్రేమనుచూపి ఆదరించినావు
    • నిర్మాలుడా భాహువు చాపి దీవించువాడవు
    • ||మహామహిమతో ||

    • పదివేలలోన గుర్తించదగిన - సుందరుడవు నీవు
    • అపరంజి పాదములు అగ్ని నేత్రములు - కలిగిన వాడవు
    • ఉన్నతుడా - మహోన్నతుడా ఆరాధించెదను
    • రక్షకుడా - ప్రభాకరుడా నిను ఆరాధించెదను
    • ||మహామహిమతో ||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 705 times