Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

Nee prema Naalo Madhuramainadi నీ ప్రేమ నాలో మధురమైనది


    • నీ ప్రేమ నాలో మధురమైనది
    • అది నా ఊహకందని క్షేమ శిఖరము (2)
    • ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను
    • పరవశించి నాలో మహిమపారతు నిన్నే
    • సర్వ కృపనిధి నీవు – సర్వాధికారివి నీవు
    • సత్యా స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే|| నీ ప్రేమ నాలో ||

    • చేరితిని నిన్నే విరిగిన మనస్సుతో - కాదనలేదే నా మనవును నీవు (2)
    • హృదయం నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం
    • నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం (2)
    • ఇది నీ బహు బంధాల అనుబంధమా
    • తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
    • నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో ||

    • నా ప్రతి పదములో జీవము నీవే
    • నా ప్రతి అడుగులో విజయము నీవే (2)
    • ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాధా
    • నీడగా నాతో నిలిచే – నీ కృపాయే నాకు చాలును (2)
    • ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా
    • తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
    • నా యేసురాజా ఆరాధన నీకే (2)|| నీ ప్రేమ నాలో ||

    • నీ సింహాసనము నను చేర్చుటకు
    • సిలువను మోయుట నేర్పించితివి (2)
    • కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు
    • దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు
    • ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
    • తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే
    • నా యేసురాజా ఆరాధన నీకే (2)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2150 times