Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సజీవుడవైన యేసయ్యా - Sajeevudavaina Yesayyaa


    • సజీవుడవైన యేసయ్యా
    • నిన్నాశ్రయించిన నీ వారికి
    • సహాయుడవై తృప్తి పరచితివే
    • సముద్రమంత సమృద్ధితో (2)
    • ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది
    • ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2)

    • ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యము
    • దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు (2)
    • శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి
    • శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2)         ||సజీవుడవైన||

    • క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారే
    • క్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను (2)
    • నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే
    • నిత్యమైన నీ సత్య వాక్యముతో (2)         ||సజీవుడవైన||

    • నలువది ఏండ్లు – నీ స్వాస్థ్యమును – మోసినది నీవే
    • నీ కృప కాంతిలో – నా చేయి విడువక – నడిపించుచున్నది నీవే (2)
    • పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే
    • పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2)         ||సజీవుడవైన||

    • Sajeevudavaina Yesayyaa
    • Ninnaashrayinchina Nee Vaariki
    • Sahaayudavai Thrupthi Parachithive
    • Samudramantha Samruddhitho (2)
    • Aanandincheda Neelo – Anudinamu Krupa Pondi
    • Aaraadhincheda Ninne – Aananda Dhvanulatho (2)

    • Dhana Raasule Ila – Dhanavanthulaku – Ee Loka Bhaagyamu
    • Daachina Melulenno – Dayachesinaave – Iha Paramuna Naaku (2)
    • Shramala Maargamunu Nireekshana Dwaaramuga Chesithive
    • Shreshtamaina Nee Vaagdhaanamulatho (2)       ||Sajeevudavaina||

    • Kshemamu Nondutaye – Sarva Janulaku – Prayaasagaa Maare
    • Kshemaadhaaramu Neevai – Deerghaayuvutho – Santhrupthi Parathuvu Nannu (2)
    • Nithya Nibandhanagaa Nee Vaathsalyamunu Choopithive
    • Nithyamaina Nee Sathya Vaakyamutho (2)       ||Sajeevudavaina||

    • Naluvadi Endlu – Nee Swaasthyamunu – Mosinadi Neeve
    • Nee Krupa Kaanthilo – Naa Cheyi Viduvaka – Nadipinchuchunnadi Neeve (2)
    • Parama Raajyamulo Mahimatho Nimputaku Anugrahinchithive
    • Paripoornamaina Nee Upadeshamunu (2)       ||Sajeevudavaina||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 11605 times