Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా - Shaashwathamaina Prematho Nanu Preminchaavayyaa


    • శాశ్వతమైన ప్రేమతో నను ప్రేమించావయ్యా
    • నీ ప్రేమే నను గెల్చెను
    • విడువక నీ కృప నా యెడ కురిపించినావయ్యా
    • నీ కృపయే నను మార్చెను
    • నీ ప్రేమ ఉన్నతం – నీ ప్రేమ అమృతం
    • నీ ప్రేమ తేనె కంటే మధురము
    • నీ ప్రేమ లోతులో – నను నడుపు యేసయ్యా
    • నీ ప్రేమలోని నే వేరు పారి నీకై జీవించినా
    • ప్రేమతో… ప్రేమతో…
    • యేసయ్యా నిను వెంబడింతును
    • ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
    • యేసయ్యా నిను ఆరాధింతును           ||శాశ్వతమైన||

    • నా తల్లి గర్భమునందు నే పిండమునైయుండఁగా
    • దృష్టించి నిర్మించిన ప్రేమ
    • నా దినములలో ఒకటైన ఆరంభము కాకమునుపే
    • గ్రంధములో లిఖియించిన ప్రేమ
    • నా ఎముకలను నా అవయములను
    • వింతగా ఎదిగించి రూపించిన ప్రేమ
    • తల్లి ఒడిలో నేను పాలు త్రాగుచున్నప్పుడు
    • నమ్మికను నాలోన పుట్టించిన ప్రేమ
    • తన సొంత పోలిక రూపులోన నను సృష్టించిన ప్రేమ
    • ప్రేమతో… ప్రేమతో…
    • నీ కోసం సృజియించావయ్యా
    • ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
    • నను మురిపెంగా లాలించావయ్యా            ||శాశ్వతమైన||

    • నే ప్రభువును ఎరుగక యుండి అజ్ఞానముతో ఉన్నప్పుడు
    • నను విడువక వెంటాడిన ప్రేమ
    • నా సృష్టికర్తను గూర్చి స్మరణే నాలో లేనప్పుడు
    • నా కోసం వేచిచూచిన ప్రేమ
    • బాల్య దినముల నుండి నను సంరక్షించి
    • కంటి రెప్పలా నన్ను కాపాడిన ప్రేమ
    • యవ్వన కాలమున కృపతో నను కలిసి
    • సత్యమును బోధించి వెలిగించిన ప్రేమ
    • నే వెదకకున్నను నాకు దొరికి నను బ్రతికించిన ప్రేమ
    • ప్రేమతో… ప్రేమతో…
    • యేసయ్యా నను దర్శించినావయ్యా
    • ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
    • నను ప్రత్యేకపరిచావేసయ్యా            ||శాశ్వతమైన||

    • నే పాపినై యుండగానే నాకై మరణించిన ప్రేమ
    • తన సొత్తుగా చేసుకున్న ప్రేమ
    • విలువే లేనట్టి నాకై తన ప్రాణపు విలువని చెల్లించి
    • నా విలువని పెంచేసిన ప్రేమ
    • లోకమే నను గూర్చి చులకన చేసినను
    • తన దృష్టిలో నేను ఘనుడన్న ప్రేమ
    • ఎవరూ లేకున్నా నేను నీకు సరిపోనా
    • నీవు బహు ప్రియుడవని బలపరచిన ప్రేమ
    • నా ముద్దు బిడ్డ నువ్వంటూ నన్ను తెగ ముద్దాడిన ప్రేమ
    • యేసయ్యా… యేసయ్యా…
    • నాపై ఇంత ప్రేమ ఏంటయ్యా
    • యేసయ్యా… యేసయ్యా… యేసయ్యా…
    • నను నీలా మార్చేందులకేనయ్యా           ||శాశ్వతమైన||

    • పలు మార్లు నే పాడినప్పుడు బహు చిక్కులలోనున్నప్పుడు
    • కరుణించి పైకి లేపిన ప్రేమ
    • నేనే నిను చేసానంటూ నేనే భరియిస్తానంటూ
    • నను చంకన ఎత్తుకున్న ప్రేమ
    • నా తప్పటడుగులు తప్పకుండ సరి చేసి
    • తప్పులను మాన్పించి స్థిరపరచిన ప్రేమ
    • నన్ను బట్టి మారదుగా నన్ను చేరదీసెనుగా
    • షరతులే లేనట్టి నా తండ్రి ప్రేమ
    • తనకిష్టమైన ఘనమైన పాత్రగా నను మలచిన ప్రేమ
    • ప్రేమతో… ప్రేమతో…
    • నను మరలా సమకూర్చావేసయ్యా
    • ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
    • నీ సాక్ష్యంగా నిలబెట్టావయ్యా           ||శాశ్వతమైన||

    • కష్టాల కొలుముల్లోన కన్నీటి లోయల్లోన
    • నా తోడై ధైర్యపరచిన ప్రేమ
    • చెలరేగిన తుఫానులలో ఎడతెగని పోరాటంలో
    • తన మాటతో శాంతినిచ్చింది ప్రేమ
    • లోకమే మారిననూ మనుషులే మరచిననూ
    • మరువనే మరువదుగా నా యేసు ప్రేమ
    • తల్లిలా ప్రేమించి తండ్రిలా బోధించి
    • ఆలోచన చెప్పి విడిపించిన ప్రేమ
    • క్షణమాత్రమైన నను వీడిపోని వాత్సల్యత గల ప్రేమ
    • ప్రేమతో… ప్రేమతో…
    • నా విశ్వాసం కాపాడవయ్యా
    • ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
    • బంగారంలా మెరిపించావయ్యా            ||శాశ్వతమైన||

    • ఊహించలేనటువంటి కృపాలని నాపై కురిపించి
    • నా స్థితి గతి మార్చివేసిన ప్రేమ
    • నా సొంత శక్తితో నేను ఎన్నడును పొందగలేని
    • అందలమును ఎక్కించిన ప్రేమ
    • పక్షి రాజు రెక్కలపై నిత్యము నను మోస్తూ
    • శిఖరముపై నన్ను నడిపించు ప్రేమ
    • పర్వతాలపై ఎప్పుడు క్రీస్తు వార్త చాటించే
    • సుందరపు పాదములు నాకిచ్చిన ప్రేమ
    • తన రాయబారిగా నన్ను ఉంచిన యేసే ఈ ప్రేమ
    • ప్రేమతో… ప్రేమతో…
    • శాశ్వత జీవం నాకిచ్చావయ్యా
    • ప్రేమతో… ప్రేమతో… ప్రేమతో…
    • నను చిరకాలం ప్రేమిస్తావయ్యా        ||శాశ్వతమైన||

    • Shaashwathamaina Prematho Nanu Preminchaavayyaa
    • Nee Preme Nanu Gelchenu
    • Viduvaka Nee Krupa Naa Yeda Kuripinchinaavayya
    • Nee Krupaye Nanu Maarchenu
    • Nee Prema Unnatham – Nee Prema Amrutham
    • Nee Prema Thene Kante Madhuramu
    • Nee Prema Lothulo – Nanu Nadupu Yesayyaa
    • Nee Premalona Ne Veru Paari Neekai Jeevinchanaa
    • Prematho… Prematho…
    • Yesayyaa Ninu Vembadinthunu
    • Prematho… Prematho… Prematho…
    • Yesayyaa Ninu Aaraadhinthunu          ||Shaashwathamaina||

    • Naa Thalli Garbhamunandu Ne Pindamunayyundangaa
    • Drushtinchi Nirminchina Prema
    • Naa Dinamulalo Okataina Aarambhamu Kaakamunupe
    • Grandhamulo Likhiyinchina Prema
    • Naa Emukalanu Naa Avayamulanu
    • Vinthagaa Ediginchi Roopinchina Prema
    • Thalli Odilo Nenu Paalu Thraaguchunnappudu
    • Nammikanu Naalona Puttinchina Prema
    • Thana Sontha Polika Roopulona Nanu Srushtinchina Prema
    • Prematho… Prematho…
    • Nee Kosam Srujiyinchaavayyaa
    • Prematho… Prematho… Prematho…
    • Nanu Muripemgaa Laalinchaavayyaa        ||Shaashwathamaina||

    • Ne Prabhuvunu Erugaka Yundi Agnaanamulo Unnappudu
    • Nanu Viduvaka Ventaadina Prema
    • Naa Srushtikarthanu Goorchi Smarane Naalo Lenappudu
    • Naa Kosam Vechichoochina Prema
    • Baalya Dinamula Nundi Nanu Samrakshinchi
    • Kanti Reppalaa Nannu Kaapaadina Prema
    • Yavvana Kaalamuna Krupatho Nanu Kalisi
    • Sathyamunu Bodhinchi Veliginchina Prema
    • Ne Vedakakunnanu Naaku Doriki Nanu Brathikinchina Prema
    • Prematho… Prematho…
    • Yesayyaa Nanu Darshinchinaavayyaa
    • Prematho… Prematho… Prematho…
    • Nanu Prathyekaparichaavesayyaa         ||Shaashwathamaina||

    • Ne Paapinai Yundagaane Naakai Maraninchina Prema
    • Thana Sotthugaa Chesukunna Prema
    • Viluve Lenatti Naakai Thana Praanapu Viluvani Chellinchi
    • Naa Viluvani Penchesina Prema
    • Lokame Nanu Goorchi Chulakana Chesinanu
    • Thana Drushtilo Nenu Ghanudanna Prema
    • Evaru Lekunnaa Nenu Neeku Sariponaa
    • Neevu Bahu Priyudavani Balaparachina Prema
    • Naa Muddu Bidda Nuvvantu Nannu Thega Muddaadina Prema
    • Yesayyaa… Yesayyaa…
    • Naapai Intha Prema Entayyaa
    • Yesayyaa… Yesayyaa… Yesayyaa…
    • Nanu Neelaa Maarchendulakenayyaa           ||Shaashwathamaina||

    • Palu Maarlu Ne Padinappudu Bahu Chikkulalonunnappudu
    • Karuninchi Paiki Lepina Prema
    • Nene Ninu Chesaanantu Nene Bhariyisthaanantu
    • Nanu Chankana Etthukunna Prema
    • Naa Thappatadugulanu Thappakunda Sari Chesi
    • Thappulanu Maanpinchi Sthiraparachina Prema
    • Nannu Batti Maaradugaa Nannu Cheradeesenugaa
    • Sharathule Lenatti Naa Thandri Prema
    • Thanakishtamaina Ghanamaina Paathragaa Nanu Malachina Prema
    • Prematho… Prematho…
    • Nanu Maralaa Samakoorchaavesayyaa
    • Prematho… Prematho… Prematho…
    • Nee Saakshyamgaa Nilabettaavayyaa          ||Shaashwathamaina||

    • Kashtaala Kolumullona Kanneeti Loyallona
    • Naa Thodai Dhairyaparachina Prema
    • Chelaregina Thuphaanulalo Edathegani Poraatamlo
    • Thana Maatatho Shaanthinichchina Prema
    • Lokame Maarinanu Manushule Marachinanu
    • Maruvane Maruvadugaa Naa Yesu Prema
    • Thallilaa Preminchi Thandrilaa Bodhinchi
    • Aalochana Cheppi Vidipinchina Prema
    • Kshanamaathramaina Nanu Veediponi Vaathsalyatha Gala Prema
    • Prematho… Prematho…
    • Naa Vishwaasam Kaapaadavayyaa
    • Prematho… Prematho… Prematho…
    • Bangaaramlaa Meripinchaavayyaa           ||Shaashwathamaina||

    • Oohinchalenatuvanti Krupalani Naapai Kuripinchi
    • Naa Sthithi Gathi Maarchivesina Prema
    • Naa Sontha Shakthitho Nenu Ennadunu Pondagaleni
    • Andalamunu Ekkinchina Prema
    • Pakshi Raaju Rekkalapai Nithyamu Nanu Mosthu
    • Shikharamupai Nannu Nadipinchu Prema
    • Parvathaalapai Eppudu Kreesthu Vaartha Chaatinche
    • Sundarapu Paadamulu Naakichchina Prema
    • Thana Raayabhaarigaa Nannu Unchina Yese Ee Prema
    • Prematho… Prematho…
    • Shaashwatha Jeevam Naakichchaavayyaa
    • Prematho… Prematho… Prematho…
    • Nanu Chirakaalam Premisthaavayyaa        ||Shaashwathamaina||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1878 times