Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

వధియింపబడిన గొర్రెపిల్లా - Vadhiyimpabadina Gorrepillaa


    • హోలీ హోలీ… హోలీ హోలీ… (2)
    • హోలీ హోలీ హోలీ హోలీ
    • హోలీ… యు ఆర్ హోలీ (2)

    • వధియింపబడిన గొర్రెపిల్లా – సింహాసనాసీనుడా (2)
    • నీ రక్తమిచ్చి… ప్రాణమిచ్చి… మమ్ములను కొన్నావే
    • ప్రతి జనములో… నీ ప్రజలను… నీ యాజక రాజ్యము చేసావే
    • రక్షణ జ్ఞానము స్తోత్రము – శక్తియు ఐశ్వర్యము నీదే
    • రాజ్యము బలము ప్రభావము – మహిమ ఘనత నీదే
    • అర్హుడా.. యోగ్యుడా.. కృతజ్ఞతకు పాత్రుడా (2)          ||వధియింప||

    • అన్నిటికి పైనున్నావు – అందరిని చూస్తున్నావు
    • అధికారం ఇచ్చే మహా దేవుడవు
    • ఆకాశ భూములయందు ఈ సృష్టి సర్వమునందు
    • నీ చిత్తము జరిగించే మహారాజు నువ్వు
    • నీ రాజ్యము నిలుచును నిరతము
    • నీదేగా సర్వాధికారము
    • నీవెవ్వరికి ఇత్తువో వారిదే ఔను భూ రాజ్యము
    • మహోన్నతుడు యేసుని శుద్ధులదే ఈ అధికారము              ||రక్షణ||

    • దృశ్యములు అదృశ్యములు – ఆకాశ భూజల జీవులు
    • అన్నియును నీ యందే సృజియింపబడెన్
    • సింహాసన ప్రభుత్వములు – ప్రధానులు అధికారములు
    • అందరును నీ శాసనముకు లోబడును
    • నీ మాటతో ఏలెడి ప్రభుడవు
    • నీవొకడివే సృష్టికి కర్తవు
    • పరలోక పెద్దలందరు తమ కిరీటము తీసి నిన్ను కొలుతురే
    • భూ రాజులు నివాసులు తమ మహిమనంతా తెచ్చి పూజింతురే              ||రక్షణ||

    • దావీదు చిగురువు నువ్వు – యూదా స్తుతి సింహము నువ్వు
    • దావీదు తాళపు చెవి యజమానుడవు
    • నువ్వు తలుపును మూసావంటే – తెరిచేటి వారే లేరు
    • నువ్వు తెరిచిన తలుపును మూసే వారెవరు
    • నీ భుజములపై రాజ్య భారము
    • నీదేగా నిత్య సింహాసనము
    • భూరాజ్యములన్నింటిని కూలగొట్టి నిలుచును నీ రాజ్యము
    • నిను విశ్వసించు వారికే చెందుతుంది నీ సత్య రాజ్యము              ||రక్షణ||

    • సెరాపులు కెరూబులచే – పరిశుద్ధుడు పరిశుద్ధుడని
    • తరతరములు కొనియాడబడే శుద్ధుడవు
    • నీ స్తుతిని ప్రచురము చేయ – మమ్మును నిర్మించావయ్యా
    • మా ఆరాధనకు నీవే యోగ్యుడవు
    • నీ నామము బహు పూజనీయము
    • ప్రతి నామమునకు పై నామము
    • ప్రతి వాని మోకాలును ప్రభు యేసు నామమందున వంగును
    • ప్రతి నాలుక యేసుడే అద్వితీయ ప్రభువని ఒప్పును              ||రక్షణ||

    • Holy Holy… Holy Holy… (2)
    • Holy Holy Holy Holy
    • Holy… You are Holy (2)

    • Vadhiyimpabadina Gorrepillaa – Simhaasaanaaseenudaa (2)
    • Nee Rakthamichchi… Praanamichchi… Mammulanu Konnaave
    • Prathi Janamulo… Nee Prajalanu… Nee Yaajaka Raajyamu Chesaave
    • Rakshana Gnaanamu Sthothramu – Shakthiyu Aishwaryamu Neede
    • Raajyamu Balamu Prabhaavamu – Mahima Ghanatha Neede
    • Arhudaa.. Yogyudaa.. Kruthagnathaku Paathrudaa (2)          ||Vadhiyimpa||

    • Annitiki Painunnaavu – Andarini Choosthunnaavu
    • Adhikaaram Ichche Maha Devudavu
    • Aakaasha Bhoomulayandu – Ee Srushti Sarvamunandu
    • Nee Chitthamu Jariginche Mahraaju Nuvvu
    • Nee Raajyamu Niluchunu Nirathamu
    • Needegaa Sarvaadhikaaramu
    • Neevevvariki Itthuvo Vaaride Aunu Bhoo Raajyamu
    • Mahonnathudu Yesuni Shuddhulade Ee Adhikaaramu             ||Rakshana||

    • Drushyamulu Adrushyamulu – Aakaasha Bhoojala Jeevulu
    • Anniyunu Nee Yande Srujiyimpabaden
    • Simhaasana Prabhuthvamulu – Pradhaanulu Adhikaaramulu
    • Andarunu Nee Shaasanamuku Lobadunu
    • Nee Maatatho Eledi Prabhudavu
    • Neevokadive Srushtiki Karthavu
    • Paraloka Peddalanadaru Thama Kireetamu Theesi Ninnu Kolathure
    • Bhoo Raajulu Nivaasulu Thama Mahimananthaa Thechchi Poojinthure             ||Rakshana||

    • Daaveedu Chiguruvu Nuvvu – Yoodaa Sthuthi Simhamu Nuvvu
    • Daaveedu Thaalapu Chevi Yajamaanudavu
    • Nuvvu Thalupunu Moosaavante – Thericheti Vaare Leru
    • Nuvvu Therichina Thalupunu Moose Vaarevaru
    • Nee Bhujamulapai Raajya Bhaaramu
    • Needegaa Nithya Simhaasanamu
    • Bhooraajyamulannintini Koolagotti Nilachunu Nee Raajyamu
    • Ninu Vishwasinchu Vaarike Chenduthundi Nee Sathya Raajyamu             ||Rakshana||

    • Seraapulu Keroobulache – Parishuddhudu Parishuddhudani
    • Tharatharamulu Koniyaadabade Shuddhudavu
    • Nee Sthuthini Prachuramu Cheya – Mammunu Nirminchaavayyaa
    • Maa Aaraadhanaku Neeve Yogyudavu
    • Nee Naamamu Bahu Poojaneeyamu
    • Prathi Naamamunaku Pai Naamamu
    • Prathi Vaani Mokaalunu Prabhu Yesu Naamamanduna Vangunu
    • Prathi Naaluka Yesude Advitheeya Prabhuvani Oppunu             ||Rakshana||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 681 times