Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రెండే రెండే దారులు - Rende Rende Daarulu


    • రెండే రెండే దారులు
    • ఏ దారి కావాలో మానవా
    • ఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2)
    • పరలోకం కావాలో పాతాళం కావాలో
    • తెలుసుకో మానవా (2)

    • పరలోకం గొప్ప వెలుగుతో
    • ఉన్నాది పరిశుద్ధుల కోసం (2)
    • సూర్యుడుండడు చంద్రుడుండడు
    • చీకటుండదు రాత్రియుండదు
    • నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2)
    • యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2)
    • యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2)      ||రెండే||

    • పాతాళం అగ్ని గుండము
    • ఉన్నాది ఘోరపాపుల కోసం (2)
    • అగ్ని ఆరదు పురుగు చావదు
    • గప్పగప్పున రగులుచుండును
    • ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2)
    • అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2)
    • ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు (2)       ||రెండే||

    • పుడతావు నీవు దిగంబరిగా
    • వెళతావు నీవు దిగంబరిగా (2)
    • గాలి మేడలు ఎన్నో కడతావు
    • నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు
    • లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు (2)
    • ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2)
    • అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో (2)         ||రెండే||

    • Rende Rende Daarulu
    • Ae Daari Kaavaalo Maanavaa
    • Okati Paralokam Mariyokati Paathaalam (2)
    • Paralokam Kaavaalo Paathaalam Kaavaalo
    • Thelusuko Maanavaa (2)

    • Paralokam Goppa Velugutho
    • Unnaadi Parishudhdhula Kosam (2)
    • Sooryudundadu Chandrudundadu
    • Cheekatundadu Raathriyundadu
    • Nithyudaina Yesude Prakaashinchuchundunu (2)
    • Yugayugamulu Paraloka Raajyameluchundunu (2)
    • Yesu Prabhuni Nammuko Paralokam Cheruthaavu (2)        ||Rende||

    • Paathaalam Agni Gundamu
    • Unnaadi Ghorpaapula Kosam (2)
    • Agni Aaradu Purugu Chaavadu
    • Gappugappunaa Raguluchundunu
    • Dhanavanthudu Maraninchi Agnilo Unnaadu (2)
    • Abrahaamu Rommupai Laazarunu Choosaadu (2)
    • Dhanavanthudu Choosi Aascharyapaddaadu (2)        ||Rende||

    • Pudathaavu Neevu Digambarigaa
    • Velathaavu Neevu Digambarigaa (2)
    • Gaali Medalu Enno Kadathaavu
    • Nakante Evvaru Unnaarantaavu
    • Lokamlo Ghoramaina Paapaalu Chesthaavu (2)
    • Aa Paapaale Ninnu Agnipaalu Chesthaayi (2)
    • Agnilo Padakunda Yesu Prabhuni Nammuko (2)        ||Rende||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3137 times