Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

యెహోవా నా బలమా - Yehovaa Naa Balamaa


    • యెహోవా నా బలమా
    • యదార్థమైనది నీ మార్గం
    • పరిపూర్ణమైనది నీ మార్గం (2)                  ||యెహోవా||

    • నా శత్రువులు నను చుట్టిననూ
    • నరకపు పాశములరికట్టిననూ (2)
    • వరదవలె భక్తిహీనులు పొర్లిన (2)
    • విడువక నను ఎడబాయని దేవా (2)         ||యెహోవా||

    • మరణపుటురులలో మరువక మొరలిడ
    • ఉన్నతదుర్గమై రక్షనశృంగమై (2)
    • తన ఆలయములో నా మొఱ్ఱ వినెను (2)
    • ఆదరెను ధరణి భయకంపముచే (2)         ||యెహోవా||

    • నా దీపమును వెలిగించువాడు
    • నా చీకటిని వెలుగుగా చేయును (2)
    • జలరాసులనుండి బలమైన చేతితో (2)
    • వెలుపల చేర్చిన బలమైన దేవుడు (2)     ||యెహోవా||

    • పౌరుషముగల ప్రభు కొపింపగా
    • పర్వతముల పునాదులు వణకెను (2)
    • తన నోటనుండి వచ్చిన అగ్ని (2)
    • దహించివేసెను వైరులనెల్లన్ (2)             ||యెహోవా||

    • మేఘములపై ఆయన వచ్చును
    • మేఘములను తన మాటుగ జేయును (2)
    • ఉరుముల మెరుపుల మెండుగ జేసి (2)
    • అపజయమిచ్చును అపవాదికిని (2)       ||యెహోవా||

    • దయగలవారిపై దయ చూపించును
    • కఠినులయెడల వికటము జూపును (2)
    • గర్విష్టుల యొక్క గర్వమునణుచును (2)
    • సర్వమునెరిగిన సర్వాధికారి (2)             ||యెహోవా||

    • నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును
    • ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి (2)
    • రక్షణ కేడెము నాకందించి (2)
    • అక్షయముగ తన పక్షము జేర్చిన (2)     ||యెహోవా||

    • యెహోవా జీవముగల దేవా
    • బహుగా స్తుతులకు అర్హుడ నీవే (2)
    • అన్యజనులలో ధన్యత చూపుచు (2)
    • హల్లెలూయ స్తుతిగానము చేసెద (2)       ||యెహోవా||

    • Yehovaa Naa Balamaa
    • Yadhaarthamainadi Nee Maargam
    • Paripoornamainadi Nee Maargam (2)    ||Yehovaa||

    • Naa Shathruvulu Nanu Chuttinanoo
    • Narakapu Paashamularikattinanoo (2)
    • Varadavale Bhakthiheenulu Porlina (2)
    • Vadalaka Nanu Edabaayani Devaa (2)    ||Yehovaa||

    • Maranaputurulalo Maruvaka Moralida
    • Unnathadurgamai Rakshanasrungamai (2)
    • Thana Aalayamulo Naa Mora Vinenu (2)
    • Adarenu Dharani Bhayakampamuche (2)   ||Yehovaa||

    • Naa Deepamunu Veliginchuvaadu
    • Naa Cheekatini Veluguga Cheyunu (2)
    • Jalaraasulanundi Balamaina Chethitho (2)
    • Velupala Cherchina Balamaina Devudu (2)   ||Yehovaa||

    • Pourushamugala Prabhu Kopimpagaa
    • Parvathamula Punaadulu Vanakenu (2)
    • Thana Notanundi Vachchina Agni (2)
    • Dahinchivesenu Vairulanellan (2)                 ||Yehovaa||

    • Meghamulapai Aayana Vachchunu
    • Meghamulanu Thana Maatuga Jeyunu (2)
    • Urumula Merupula Menduga Jesi (2)
    • Apajayamichchunu Apavaadikini (2)             ||Yehovaa||

    • Dayagala Vaaripai Daya Choopinchunu
    • Katinulayedala Vikatamu Joopunu (2)
    • Garvishtula Yokka Garvamunanuchunu (2)
    • Sarvamu Nerigina Sarvaadhikaari (2)           ||Yehovaa||

    • Naa Kaallanu Ledi Kaalluga Jeyunu
    • Eththaina Sthalamulo Shakthitho Nilipi (2)
    • Rakshana Kedemu Naakandinchi (2)
    • Akshayamuga Thana Pakshamu Jerchina (2) ||Yehovaa||

    • Yehovaa Jeevamugala Devaa
    • Bahugaa Sthuthulaku Arhuda Neeve (2)
    • Anyajanulalo Dhanyatha Choopuchu (2)
    • Hallelooya Sthuthigaanamu Cheseda (2)   ||Yehovaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 506 times