Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మోయలేని భారమంత సిలువలో మోసావు - Moyaleni Bhaaramantha Siluvalo Mosaavu


    • మోయలేని భారమంత సిలువలో మోసావు
    • నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2)
    • అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు
    • మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు
    • నాదు గతిని మార్చావు – (2)

    • కడలి పై నడిచిన పాదాలు
    • సిలువ బరువుకు తడబడి పోయే
    • స్వస్థతలు చూపిన హస్తములు
    • సిలువలో శీలలతో వ్రేళాడే (2)
    • ఇంత ఘోరము మోపిన నేరము
    • నేను చేసిన పాప భారము (2)        || మోయలేని ||

    • జయము నీకని పలికిన జనము
    • మహిమ ఏదని నిను నిలదీసిరి
    • పాపములు క్షమియించిన నిన్ను
    • పాపివని పలుమారులు తెలిపిరి (2)
    • తాకినంతనే మహిమ నొసగిన
    • నీదు వస్త్రము చీట్ల పరము (2)        || మోయలేని ||

    • దైవ సుతుడవు అయినా గాని
    • దొంగలతో దోషిగా నిను చేర్చిరి
    • మధుర వాక్యము నేర్పిన నోటికి
    • చేదు చిరకతో దాహము తీర్చిరి (2)
    • ఇంత జరిగిన ఎంత కరుణ
    • వదలవేమయ నీ క్షమాపణ (2)        || మోయలేని ||

    • Moyaleni Bhaaramantha Siluvalo Mosaavu
    • Neeku Naaku Dooramantha Kalvarilo Nadichaavu (2)
    • Anthuleni Needu Premaku Rujuvu Choopaavu
    • Madhuramaina Nee Sannidhiki Daari Vesaavu
    • Naadu Gathini Maarchaavu – (2)

    • Kadalipai Nadichina Paadaalu
    • Siluva Baruvuku Thadabadipoye
    • Swasthathalu Choopina Hasthamulu
    • Siluvalo Silalatho Vrelaade (2)
    • Intha Ghoramu Mopina Neramu
    • Nenu Chesina Paapa Bhaaramu (2)    ||Moyaleni||

    • Jayamu Neekani Palikina Janamu
    • Mahima Edani Ninu Niladeesiri
    • Paapamulu Kshamiyinchina Ninnu
    • Paapivani Palumaarulu Thelipiri (2)
    • Thaakinanthane Mahima Nosagina
    • Needu Vasthramu Cheetla Paramu (2)    ||Moyaleni||

    • Daiva Suthudavu Ainaa Gaani
    • Dongalatho Doshigaa Ninu Cherchiri
    • Madhura Vaakyamu Nerpina Notiki
    • Chedu Chirakatho Daahamu Theerchiri (2)
    • Intha Jarigina Entha Karuna
    • Vadalavemaya Nee Kshamaapana (2)    ||Moyaleni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3474 times