Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

పదములు చాలని ప్రేమ ఇది - Padamulu Chaalani Prema Idi


    • పదములు చాలని ప్రేమ ఇది
    • స్వరములు చాలని వర్ణనిది (2)
    • కరములు చాపి నిను కౌగలించి పెంచిన
    • కన్నవారికంటే ఇది మిన్నయైన ప్రేమ
    • వారిని సహితము కన్న ప్రేమ
    • ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ
    • ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ
    • కలువరి ప్రేమ         ||పదములు||

    • నవ మాసం మోసి ప్రయోజకులను చేసినా
    • కన్నబిడ్డలే నిను వెలివేసినా (2)
    • తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు
    • నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ
    • ఆ వేదనంత తొలగించును ప్రేమ      ||ప్రేమ||

    • మేలులెన్నో పొంది ఉన్నత స్థితికెదిగిన
    • స్నేహితులే హృదయమును గాయపరచగా (2)
    • మేలులతో నింపి అద్భుతములు చేసి
    • క్షమియించుట నేర్పించెడి ప్రేమా
    • శాంతితో నిను నడిపించెడి ప్రేమ       ||ప్రేమ||

    • Padamulu Chaalani Prema Idi
    • Swaramulu Chaalani Varnanidi (2)
    • Karamulu Chaapi Ninu Kougalinchi Penchina
    • Kannavaarikante Idi Minnayaina Prema
    • Vaarini Sahithamu Kanna Prema
    • Prema Idi Yesu Prema
    • Prema Idi Thandri Prema
    • Prema Idi Praanamichchina Prema
    • Kaluvari Prema            ||Padamulu||

    • Nava Maasam Mosi Prayojakulanu Chesinaa
    • Kannabiddale Ninu Velivesinaa (2)
    • Thana Karamulu Chaapi Mudimi Vachchu Varaku
    • Ninneththukoni Aadarinchu Prema
    • Aa Vedanantha Tholaginchunu Prema         ||Prema||

    • Melulenno Pondi Unnatha Sthithikedigina
    • Snehithule Hrudayamunu Gaayaparachaga (2)
    • Melulatho Nimpi Adbhuthamulu Chesi
    • Kshamiyinchuta Nerpinchedi Premaa
    • Shaanthitho Ninu Nadipinchedi Prema         ||Prema||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 21487 times