Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా ప్రాణమా దిగులెందుకు - Naa Praanamaa Digulenduku


    • నా ప్రాణమా దిగులెందుకు – నీ రక్షకుని స్మరియించుకో
    • మహిమోన్నతుడు బలవంతుడు – నీ పక్షమునే నిలిచెను చూడు
    • లేవరా వీరుడా – నిరాశను వీడరా
    • నీ రాజు నిన్ను పిలిచెను – కదులు ముందుకు కదులు ముందుకు
    • అసాధ్యుడే నీకుండగా – అసాధ్యము నీకుండునా
    • భయము వీడి నడవరా – జయము నీదే జయము నీదే ౹౹నా ప్రాణమా||

    • యేసులో విశ్వాసమే నీ చేతిలోని ఆయుధం
    • విడువకుండ పట్టుకో ఎన్ని శ్రమలు నీకు కలిగినా
    • లేమిలో కొలిమిలో ఒంటరివి కావు ఎన్నడూ
    • యేసు నీతో ఉండును నీ సహాయమాయనే
    • నీవు వెంబడించువాడు నీవు నమ్మదగిన దేవుడు
    • నీ శ్రమలు దూరపరచును నిన్ను గొప్పగా హెచ్చించును (2) ||నా ప్రాణమా||

    • గర్జించు సింహమువలె సాతాను వెంటపడినను
    • ఎదురు తిరిగి నిలబడు వాడు నిలువలేకపోవును
    • జయించెనేసు ఎన్నడో సాతాను ఓడిపోయెను
    • నీ ఎదుటనున్న శత్రువు ప్రభావము శూన్యమే
    • నీలోన ఉన్నవాడు లోకములనేలువాడు
    • నిర్భయముగా సాగిపో నిన్ను ఆపలేరు ఎవ్వరు (2) ||నా ప్రాణమా||

    • నీవు ఎక్కలేని కొండను ఎక్కించును నీ దేవుడు
    • నీవు చేరలేని ఎత్తుకు నిన్ను మోయునాయనే
    • నీ ప్రయాస కాదు వ్యర్థము యేసు గొప్ప ఫలము దాచెను
    • తన తండ్రి ఇంట నీకును సిద్ధపరచెను నివాసము
    • ఊహించలేని మహిమతో ప్రభువు నిన్ను నింపివేయును
    • ఆశ్చర్యమైన స్వాస్థ్యము నీ చేతికప్పగించును (2) ౹౹నా ప్రాణమా||

    • Naa Praanamaa Digulenduku – Nee Rakshakuni Smariyinchuko
    • Mahimonnathudu Balavanthudu – Nee Pakshamune Nilichenu Choodu
    • Levaa Veerudaa – Niraashanu Veedaraa
    • Nee Raaju Ninnu Pilichenu – Kadulu Munduku Kadulu Munduku
    • Asaadhyude Neekundagaa – Asaadhyamu Neekundunaa
    • Bhayamu Veedi Vadavaraa – Jayamu Neede Jayamu Neede ||Naa Praanamaa||

    • Yesulo Vishwaasame Nee Chethiloni Aayudham
    • Viduvakunda Pattuko Enni Shramalu Neeku Kaliginaa
    • Lemilo Kalimilo Ontarivi Kaavu Ennadu
    • Yesu Neetho Undunu Nee Sahaayamaayane
    • Neevu Vembadinchuvaadu Neevu Nammadagina Devudu
    • Nee Shramalu Dooraparachunu Ninnu Goppagaa Hecchinchunu (2) ||Naa Praanamaa||

    • Garjinchu Simhamu Vale Saathaanu Ventapadinanu
    • Eduru Thirigi Nilabadu Vaadu Niluvaleka Povunu
    • Jayinchenesu Ennado Saathaanu Odipoyenu
    • Nee Edutanunna Shathruvu Prabhaavamu Shoonyame
    • Neelona Unnavaadu Lokamulaneluvaadu
    • Nirbhayamugaa Saagipo Ninnu Aapaleru Evvaru (2) ||Naa Praanamaa||

    • Neevu EKkaleni Kondanu Ekkinchunu Nee Devudu
    • Neevu Cheraleni Etthuku Ninnu Moyunaayane
    • Nee Prayaasa Kaadu Vyardhamu Yesu Goppa Phalamu Daachenu
    • Thana Thandri Inta Neekunu Siddhaparachenu Nivaasamu
    • Oohinchaleni Mahimatho Prabhuvu Ninnu Nimpiveyunu
    • Aascharyamaina Swaasthyamu Nee Chethikappaginchunu (2) ||Naa Praanamaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 656 times