Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నా కొరకై అన్నియు చేసెను యేసు - Naa Korakai Anniyu Chesenu Yesu


    • నా కొరకై అన్నియు చేసెను యేసు
    • నాకింకా భయము లేదు లోకములో (2)
    • నా కొరకై అన్నియు చేసినందులకు (2)
    • నేను – రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించెదన్ (2)       ||నా కొరకై||

    • క్షామమందు ఏలీయాకు అప్పమిచ్చెను
    • క్షామం తీర్చి ఏలీయాని ఆశీర్వదించెన్ (2)
    • క్షామం తీరే వరకు ఆ విధవరాలి (2)
    • ఇంట నూనెకైనా పిండికైనా కొరత లేదు (2)       ||నా కొరకై||

    • ఆకాశ పక్షులను గమనించుడి
    • విత్తవు అవి పంట కోయవు (2)
    • వాటిని పోషించునట్టి పరమ పితా (2)
    • మమ్ము – అనుదినం అద్భుతముగా నడుపును (2)       ||నా కొరకై||

    • ఏమి ధరింతుమని చింతపడకు
    • అడవి పువ్వులను తేరి చూడుము (2)
    • అడవి పువ్వుల ప్రభు అలంకరింప (2)
    • తానె – నిశ్చయముగా అలంకరించును (2)       ||నా కొరకై||

    • రేపటి దినము గూర్చి చింత పడకు
    • ఆప్తుడేసు నాకుండ భయము ఎందుకు (2)
    • రేపు దాని సంగతులనదే చింతించున్ (2)
    • ఏ – నాటి కీడు ఆనాటికే ఇల చాలును (2)       ||నా కొరకై||

    • ఆశీర్వదించెడి యేసు అరణ్యములో
    • పోషించెను ఐదు వేల మందిని కూడా (2)
    • తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్ (2)
    • యేసు – తన్ను తానే అర్పించెను నా కొరకై (2)       ||నా కొరకై||

    • Naa Korakai Anniyu Chesenu Yesu
    • Naakinkaa Bhayamu Ledu Lokamulo (2)
    • Naa Korakai Anniyu Chesinandulaku (2)
    • Nenu – Rakshana Paathranu Etthi Aaraadhinchedan (2)       ||Naa Korakai||

    • Kshaamamandu Eliyaaku Appamichchenu
    • Kshaamam Theerchi Eliyaanu Aasheervadinchen (2)
    • Kshaamam Theere Varaku Aa Vidhavaraali (2)
    • Inta – Noonekainaa Pindikainaa Korataha Ledu (2)       ||Naa Korakai||

    • Aakaasha Pakshulanu Gamaninchudi
    • Vitthavu Avi Panta Koyavu (2)
    • Vaatini Poshinchunatti Parama Pithaa (2)
    • Mammu – Anudinam Adbhuthamugaa Nadupunu (2)       ||Naa Korakai||

    • Emi Dharinthumani Chintha Padaku
    • Adavi Puvvulanu Theri Choodumu (2)
    • Adavi Puvvula Praabhu Alankarimpa (2)
    • Thaane – Nischayamugaa Alankarinchunu (2)       ||Naa Korakai||

    • Repati Dinamu Goorchi Chintha Padaku
    • Aapthudesu Naakunda Bhayamu Enduku (2)
    • Repu Daani Sangathulanade Chinthinchun (2)
    • Ae – Naati Keedu Aanaatike Ila Chaalunu (2)       ||Naa Korakai||

    • Aasheervadinchedi Yesu Aranyamulo
    • Poshinchenu Aidu Vela Mandini Koodaa (2)
    • Theerchunu Prabhuve Prathi Avasarathan (2)
    • Yesu – Thannu Thaane Arpinchenu Naa Korakai (2)       ||Naa Korakai||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 3742 times