Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం - Devude Ila Cheretanduku Ennukunna Maargam


    • దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం
    • అమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనెను జన్మం
    • నీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం
    • కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం (2)
    • అమ్మా నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో
    • ఆ దైవము సైతము నేర్చె పాఠాలు చల్లని నీ ఒడిలో (2)         ||దేవుడే||

    • కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం
    • తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం (2)
    • మోషేగా మారిన పసివాడిని
    • దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం (2)
    • దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం       ||అమ్మా||

    • సంతతి లేక సవతి పోరుతో విసిగినట్టి దీనత్వం
    • దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను మాతృత్వం (2)
    • హన్నా చేసిన ఆ త్యాగమే కాదా
    • సమూయేలు పొందిన న్యాయాధిపత్యము (2)
    • సమూయేలు పొందిన న్యాయాధిపత్యము      ||అమ్మా||

    • కొన ఊపిరితో సిలువపైన వేళాడుతున్న క్షణము
    • ఆ దేవ దేవుడు తీర్చుకొనెను తన మాతృమూర్తి ఋణము (2)
    • ప్రియ శిష్యుని దరికి తల్లిని చేర్చి
    • నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం (2)
    • నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం      ||అమ్మా||

    • Devude Ila Cheretanduku Ennukunna Maargam
    • Ammaa Antu Piluchukoni Pondukonenu Janmam
    • Neekantu Edi Ledannatlu Endukantha Thyaagam
    • Kanaraani Premaku Neevegaa Kadalaaduthunna Roopam (2)
    • Ammaa Nee Runamunu Theerche Sirulu Levu Ilalo
    • Aa Daivamu Saithamu Nerche Paataalu Challani Nee Odilo (2)  ||Devude||

    • Kanna Biddanu Paraayi Biddagaa Penchukunna Mamakaaram
    • Thana Prajala Vinukthiki Devudu Chesina Kaaryamlo Sahakaaram (2)
    • Moshegaa Maarina Pasivaadini
    • Daasigaa Penchina Kannathalli Sugunam (2)
    • Daasigaa Penchina Kannathalli Sugunam      ||Ammaa||

    • Santhathi Leka Savathi Porutho Visiginatti Deenathvam
    • Devuni Sannidhi Hrudayamu Parachi Pondukonenu Maathruthvam (2)
    • Hannaa Chesina Aa Thyaagame Kaadaa
    • Samooyelu Pondina Nyaayaadhipathyamu (2)
    • Samooyelu Pondina Nyaayaadhipathyamu      ||Ammaa||

    • Kona Oopiritho Siluvapaina Velaaduthunna Kshanamu
    • Aa Deva Devudu Theerchukonenu Thana Maathrumoorthy Runamu (2)
    • Priya Shishyuni Dariki Thallini Cherchi
    • Neraverchenu Ilalo Thanayudigaa Dharmam (2)
    • Neraverchenu Ilalo Thanayudigaa Dharmam      ||Ammaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 219 times