Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

దేవుడు దేహమును పొందిన దినము - Devudu Dehamunu Pondina Dinamu


    • దేవుడు దేహమును పొందిన దినము
    • మనిషిగా మారి ఇల చేరిన క్షణము (2)
    • తార వెలిగెను – దూత పాడెను
    • పరలోకనికి మార్గము వెలిసెను (2)
    • స్తుతుల గానములు పాడి పరవశించెదము
    • యేసు నామమునే చాటి మహిమ పరిచెదము (2)

    • దూత పలికెను భయము వలదని
    • తెలిపే వార్తను యేసే క్రీస్తని (2)
    • చీకటి తొలగెను రారాజుకు భయపడి
    • లోకము వెలిగెను మరణము చెరవిడి (2)
    • క్రీస్తు పుట్టెనని తెలిపి సంతోషించెదము
    • నిత్య జీవమునే చాటి ఘనత పొందెదము (2)       ||దేవుడు||

    • సృష్టి కారుడు అల్పుడాయెను
    • అది శాపము తీయ వచ్చెను (2)
    • పాపము ఎరుగని మనిషిగా బ్రతికెను
    • మానవ జాతికి మార్గమై నిలిచెను (2)
    • నమ్మి ఒప్పినను చాలు తొలగు పాపములు
    • పరము చేరుటకు మనకు కలుగు దీవెనలు (2)       ||దేవుడు||

    • Devudu Dehamunu Pondina Dinamu
    • Manishigaa Maari Ila Cherina Kshanamu (2)
    • Thaara Veligenu – Dootha Paadenu
    • Paralokaaniki Maargamu Velisenu (2)
    • Sthuthulu Gaanamulu Paadi Paravashinchedamu
    • Yesu Naamamune Chaati Mahima Parichedamu (2)       ||Devudu||

    • Dootha Palikenu Bhayamu Valadani
    • Thelipe Vaarthanu Yese Kreesthani (2)
    • Cheekati Tholagenu Raaraajuku Bhayapadi
    • Lokamu Veligenu Maranamu Cheravidi (2)
    • Kreesthu Puttenani Thelipi Santhoshinchedamu
    • Nithya Jeevamune Chaati Ghanatha Pondedamu (2)       ||Devudu||

    • Srushtikaarudu Alpudaayenu
    • Aadi Shaapamu Theeya Vachchenu (2)
    • Paapamu Erugani Manishigaa Brathikenu
    • Maanava Jaathiki Maargamai Nilichenu (2)
    • Nammi Oppinanu Chaalu Tholagu Paapamulu
    • Paramu Cherutaku Manaku Kalugu Deevenalu (2)       ||Devudu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 221 times