Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ


    • నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ
    • లోకాన నిను చాటగా - నా స్వరం వాడనీ
    • నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    • ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    •  
    • 1. ఏ చోట గళమెత్తినా - నీ ప్రేమ ధ్వనియించనీ
    • పాడేటి ప్రతి పాటలో - నీ రూపు కనిపించనీ = 2
    • వినిపించుచున్నప్పుడే - ఉద్రేకమును రేపక
    • స్థిరమైన ఉజ్జీవము - లోలోన రగిలించనీ
    • నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    • ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    •   
    • 2. నీ దివ్య గానామృతం - జలధారలుగా పొంగనీ
    • తాకేటి ప్రతి వారినీ - ఫలవంతముగా మార్చనీ = 2
    • శృతిలయలు లోపించక - విసిగింపు కలిగించక
    • నిజమైన ఉల్లాసమై - నిలువెల్లా కదిలించనీ
    • నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    • ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    •  
    • 3. ఆత్మీయ గీతాలతో - తనువంతా పులకించనీ
    • సంగీతమే భోధయై - కనువిప్పు కలిగించనీ = 2
    • కాలక్షేపం కోసమే - పరిమితము కాకుండగా
    • హృదయాల్లో నివసించుచూ - కార్యాలు జరిగించనీ
    • నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    • ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 24454 times