Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

భజన చేయుచు భక్తపాలక - ప్రస్తుతింతు నీ నామమును


    • భజన చేయుచు భక్తపాలక - ప్రస్తుతింతు నీ నామమును
    • వృజనములపై జయమునిచ్చిన - విజయుడా నిను వేడుకొందు

    • 1. దివ్యపదవిని విడిచి నీవు - దీనుడవై పుట్టినావు
    • భవ్యమైన బోధలెన్నో - బాగుగా ధర నేర్పినావు

    • 2. నరుల గావను పరమునుండి - ధరకు నీవు వచ్చినావు
    • పరుడనైన నా కొరకు నీ - ప్రాణము నర్పించినావు

    • 3. చెడిన వాడనైన నన్ను - జేరదీసి బ్రోచినావు
    • పడిననాదు గోతి నుండి పైకి లేవనెత్తినావు

    • 4. ఎంత ప్రేమ యెంతదయ - యెంత కృప యేసయ్య నీకు
    • ఇంతయని వర్ణింప నిలలో - నెవనికిని సాధ్యంబు కాదు