Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

అదే అదే ఆ రోజూ - యేసయ్య ఉగ్రత రోజు


    • అదే అదే ఆ రోజూ - యేసయ్య ఉగ్రత రోజు
    • ఏడేండ్ల శ్రమల రోజూ - పాపులంతా ఏడ్చే రోజు
    •  
    • 1. సూర్యుడు నలుపయ్యే రోజూ - చంద్రుడు ఎరుపయ్యే రోజూ - 2
    • భూకంపం కలిగే రోజూ - దిక్కులేక అరచే రోజూ
    • ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..
    •  
    • 2. వ్యభిచారులు ఏడ్చే రోజూ - మోసగాళ్ళు మసలే రోజూ - 2
    • అబద్ధికులు అరచే రోజూ - దొంగలంతా దొర్లే రోజూ
    • ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..
    •  
    • 3. పిల్ల జాడ తల్లికి లేదు - తల్లి జాడ పిల్లకు లేదు - 2
    • చెట్టుకొక్కరై పుట్టకొక్కరై - అనాథలై అరచే రోజు
    • ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..
    •  
    • 4. ఓ మనిషీ... యోచింపవా - నీ బ్రతుకు ఎలా ఉన్నదో - 2
    • బలము చూచి భంగపడకుమా - ధనము చూసి దగాపడకుమా
    • ఆ రోజు శ్రమనుండి - తప్పించే నాథుడు లేడు..
  • Album: Nireekshana, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 8497 times