Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నడిపించు నా నావ - నడి సంద్రమున దేవ


    • నడిపించు  నా నావ - నడి సంద్రమున దేవ 
    •      నవ జీవన మార్గమున - నా జన్మ తరి ఇంప

    • 1.  నా జీవిత  తీరమున  - నా అపజయ భారమున
    •      నలిగినా నా హృదయమును - నడిపించుము లోతునకు
    •      నా ఆత్మా విరబూయ - నా దీక్ష  ఫలింప 
    •      నా నావలో కాలిడుము - నా సేవ జేసుకోనుము //నడిపించు //
    • 2. రాత్రంతయు శ్రమ పడినా - రాలేదు ప్రభు జయము 
    •      రహదారులు వెదకినాను - రాదాయే ప్రతిపలము   
    •      రక్షించు  నీ సిలువ - రమణీయ లోతులలో 
    •      రతనాలను  వేదకుటలో - రాజిల్లు నా పడవ //నడిపించు //
    • 3. ఆత్మార్పణ చేయకయే - ఆశించితి నీ చెలిమి
    •     అహమును ప్రేమించుచునే - అరసితి నీ కలిమి  
    •     ఆశ నిరాశాయే - ఆవేదనేదురాయే
    •     ఆద్యాత్మిక లేమిగని - అల్లాడే నా వలలు  //నడిపించు //
    • 4. ప్రభు మార్గము విడచితిని - ప్రార్థించుట మానితిని 
    •     ప్రభు వాక్యము వదలితిని - పరమార్థము మరచితిని 
    •     ప్రపంచ నటనలలో - ప్రావిన్యమును బొంది
    •     ఫల హీనుడని ఇపుడు - పాటింతు నీ మాట  //నడిపించు //
    • 5. లోతైన జలములలో - లోతైన వినబడు స్వరమా 
    •     లోబడుతాను నేర్పించి - లోపంబులు సవరించి 
    •     లోనున్న ఈవులలో - లోతైన నా బ్రతుకు 
    •     లోపించని యర్పనగా - లోకేష చేయుమయా  //నడిపించు //
    • 6. ప్రభు యేసుని  శిష్యుడనై - ప్రభు ప్రేమలో పాదుకుని
    •     ప్రకటింతును లోకములో - పరిశుద్దుని ప్రేమ కథ 
    •     పరమాత్మ ప్రోక్షణతో - పరి పూర్ణ సమర్పణతో 
    •     ప్రానంబును ప్రభు కొరకు - పానార్పనము చేతు //నడిపించు //