Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఆరని ప్రేమ ఇది - ఆర్పజాలని జ్వాల ఇది


    • పల్లవి : ఆరని ప్రేమ ఇది - ఆర్పజాలని జ్వాల ఇది 
    •             అతి శ్రేష్టమైనది - అంతమే లేనిది 
    •             అవధులే లేనిది - అక్షయమైన ప్రేమ ఇది 
    •             కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది      

    •         1. సింహాసనము నుండి - సిలువకు దిగి వచ్చినది 
    •             బలమైనది మరణము కన్నా - మృతి ని గెల్చి లేచినది 
    •             ఇది సజీవమైనది - ఇదే సత్యమైనది 
    •             ఇదే నిత్యమైనది - క్రీస్తు యేసు ప్రేమ ఇది
    •             కలువరి ప్రేమ ఇది - క్రీస్తు కలువరి ప్రేమ ఇది     

    •         2. నా స్థాన మందు నిలిచి - నా శిక్ష నే బరియించి 
    •             క్రయ ధనమును చెల్లించి - గొప్ప రక్షణ నిచ్చినది 
    •             నాకు విలువ నిచ్చినది - నన్ను వెలిగించినది 
    •             ఆ ఉన్నత రాజ్య మందు - నాకు స్థాన మిచ్చినది 
    •             ఉన్నత ప్రేమ ఇది - అత్యున్నత ప్రేమ ఇది        

    •         3. భూ రాజులు అధిపతులు - రాజ్యాలు అధికారాలు 
    •            చేరయైన ఖడ్గమైన - కరువైన ఎదురైనా 
    •            ఎవరు ఆర్పలేనిది - ఎవరు ఆపలేనిది 
    •            ప్రవహించుచున్నది - ప్రతి పాపి చెంతకు 
    •            ప్రేమ ప్రవాహమిది - యేసు ప్రేమ ప్రవాహమిది       
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 15734 times