Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఏదేను తోటలో... ఆదాము హవ్వలు


  • Play Song :
    • ఏదేను తోటలో... ఆదాము  హవ్వలు  - ప్రతి చల్లపూట తన తండ్రితో... ఏ పాపమెరుగని స్థితిలో
    • ఆజ్ఞను అతిక్రమించి - అపవాది మాటను పాటించి - తప్పుచేశారు - తప్పు తండ్రిపై నెట్టివేశారు..
    • చెట్టు వేయుటే నేరమా...?! దేవుడు ముందుగా చెప్పకుండెనా...?!
    • తెలుసుకో దీని రహస్యం.. చెట్టులోనే ఉంది పరమార్ధం.. 

    • చెడు చేయడానికి అవకాశముండి చెడు చేయనివాడు గొప్పవాడా...? 
    • చెడు చేయడానికి అవకాశమేలేక చేయనివాడు గొప్పవాడా... ?
    • నీ గొప్పతనాన్ని నిరూపించుకో.. మంచిచెడులు యోచించి తెలుసుకో..
    • చెట్టు వేయుటే నేరమా...?! దేవుడు ముందుగా చెప్పకుండెనా...?!
    • తెలుసుకో దీని రహస్యం.. చెట్టులోనే ఉంది పరమార్ధం.. 

    • మంచివాడివని నిరూపించుటకు - పరీక్ష ఉండాలి 
    • గొప్పవాడవని  రుజువుచెయుటకు - చెట్టు వేయాలి
    • చెడు చేయకుండానే చెడును తెలుసుకో - దైవలక్షణముందని రుజువు చేసుకో..
    • చెట్టు ఉన్నా ఫలము తిననివాడే గొప్పవాడు - చెట్టు వేయకుంటే గొప్పతనానికే అర్ధంలేదు
    • తెలుసుకో దీని రహస్యం.. చెట్టులోనే ఉంది పరమార్ధం.. 
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 4487 times