Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కనుగొంటిని నిన్నే ఓ నజరేయా


  • Play Song :
    • కనుగొంటిని నిన్నే ఓ నజరేయా - సమర్థుడవని సహాయము చేయ..
    •      నీ ప్రభావము - నాలోకి చేరగా - నా స్వరూపమూ - మారిపోయెగా..

    • 1.  ప్రయత్నాలు చేసి వేసారియుంటిని - ఉన్న ఆస్తినంతా చేజార్చుకొంటిని..
    •      వైద్యులచుట్టూ - కాళ్లు అరిగేటట్టు - ఎంతతిరిగినా - సరికాక యుంటిని.. 

    • 2.  స్వంతజనులతోనే వెలివేయబడితిని  - అపనిందలపాలై మతిపోయి చెడితిని..
    •      బ్రతుకెందుకని - మనసే చంపుకుని - జీవశ్చవమై - ఇల మిగిలియుంటిని..

    • 3.  నీ మహిమను గూర్చి వార్తలను వింటిని - స్వస్తపరచు దేవా నిను నమ్ముకొంటిని..
    •      ధైర్యములేక - ఎదురుగ రాలేక - వెనుకనుండి వచ్చి నిను ముట్టుకుంటిని..
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 19260 times