Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల


    • సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల
    • విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు  

    • నా యతిక్రమములకై  నలుగగొట్టబడి  
    • నా దోషముల నీవు  ప్రియముగను మోసితివా ||సిలువలో||  

    • నా రోగముల నీపై నమ్రతతో భరియించి
    • త్రుణీకరింపబడి  ప్రాణమర్పించితివి ||సిలువలో||

    • వ్యసనాక్రాంతుడవుగా  వ్యాధిననుభవించి
    • మౌనము ధరించి  మరణమైతివా ప్రభువా ||సిలువలో ||

    • పరమున కెత్తబడిన  ప్రియ యేసురాకడకై
    • పదిలముగ కనిపెట్టి  పాడెదను హల్లెలూయ ||సిలువలో ||
  • Album: సీయోను గీతాలు, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1339 times