Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

న్యాయాధిపతిఐన దేవుడు నిను తీర్పు తీర్చేటి వేళలో


    • న్యాయాధిపతిఐన దేవుడు  నిను తీర్పు తీర్చేటి వేళలో
    • ఏ గుంపులో నీ వుందువో 
    • యోచించుకో ఓ క్రైస్తవా యోచించుకో ఓ మానవా

    • ఆకలితో వ్యధ నొందగా దాహముతో తపియించగా|| 2 ||
    • రోగముతో క్రుశిఇంచగా || 2 ||
    • నను చేర్చుకొనలేదు నీ వెందుకో || 2 ||
    • అని యేసు నిన్నడిగిన ఏమందువు || 2 |||| న్యా ||

    • గొర్రలనే నీతిమంతులు మేకలనే పాపత్ములు  || 2 ||
    • మందలుగా విభజింపగా || 2 ||
    • ఆ రెంటిలో నీది ఏ స్థానమో || 2 ||
    • అని యేసు నిన్నడిగిన ఏమందువు || 2 |||| న్యా ||

    • గొర్రెలకు నిత్య జీవము మేకలకు నిత్య నరకము || 2 ||
    • ప్రతిఫలము నొసంగేనుగా  || 2 ||
    • ఏ వైపునా నీవు నిలుచుందువో || 2 ||
    • అని యేసు నిన్నడిగిన ఏమందువు || 2 || || న్యా ||

  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 11850 times