Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

భయము చెందకు భక్తుడా


    • భయము చెందకు భక్తుడా  ఈ మాయలోక ఛాయాలు చూచినపుడు || 2 ||
    • భయము చెందకు నీవు  జయము దయచేయువాడు    || 2 ||
    • దేవుడేహొవా ఉన్నాడు  మన సాయంనకు దేవుడేసయ్యా ఉన్నాడు || 2 ||                

    • బబులోను దేశమందున  ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున  || 2 ||
    • పట్టి బంధించే రాజు  అగ్ని గుండంలో వేసే || 2 ||
    • నాల్గవవాడిగ ఉండలేదా  మన యేసురాజు నాల్గవవాడిగ ఉండలేదా || 2 ||      

    • చెరసాలలో వేసినా  తమ దేహమంత గాయలతో నిండిన || 2 ||
    • పాడి కీర్తించి  పౌలు సీలల్ కొనియాడె || 2 ||
    • భూకంపం కలగలేదా  ఓ భక్తుడా భూకంపం కలగలేదా || 2 ||                                    

    • ఆస్తియంతా పోయినా  తన దేహమంతా కుర్పులతో నిండిన || 2 ||
    • అన్ని ఇచ్చిన తండ్రి  అన్ని తీసుకు పోయే || 2 ||
    • అని యోబు పల్కలేదా  ఓ భక్తుడా అని యోబు పల్కలేదా || 2 ||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 6521 times