Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

నీ ధనము - నీ ఘనము ప్రభు యేసుదే


    • నీ ధనము - నీ ఘనము ప్రభు యేసుదే
    • నీ దశమ భాగము నీయ వెనుదీతువా

    • 1)  ధరలోన ధన ధాన్యముల నీయగా కరుణించికాపాడిరక్షింపగా
    •      పరలోక నాధుండు నీ కీయగామరి యేసుకొరకీయవెనుదీతువా 

    • 2) పాడిపంటలుప్రభువునీకీయగా కూడుగుడ్డలు నీకుదయచేయగా
    •      వేడంగ ప్రభుయేసు నామంబును గడువేల ప్రభుకీయనో క్రైస్తవ 

    • 3)  వెలుగు నీడలు గాలివర్షంబులు – కలిగించె ప్రభునీకు ఉచితంబుగా 
    •     వెలిగించ ధరపైన ప్రభునామమును కలిమికొలది ప్రభునకర్పింపవా

    • 4) కలిగించె సకలంబు సమృద్ధిగా తొలగించె పలుబాధ భరితంబులు 
    •    బలియాయే నీ పాపముల కోసమే  చెలువంగ ప్రభుకీయ చింతింతువా