Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు


    • మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు
    • మహితోటలో నరమొక్కలు నాటించాడు
    • తన పుత్రుని రక్త నీరు తడికట్టి పెంచాడు
    • తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు
    • కాయవే తోట కమ్మని కాయలు
    • పండవే చెట్టా తియ్యని ఫలములు

    • 1.నీతిపోత జాపికాపు ఆత్మశుద్ధ ఫలములు
    • నీతండ్రి నిలువ చేయు నిత్యజీవ నిధులు
    • అనంతమైన ఆత్మపొందు అమర సుఖశాంతులు
    • అనుకూల సమయమిదే పూయు పరమ పూతలు

    • 2.అపవాది వెంటబడ కుంటుపడిపోకుము
    • కాపు పట్టి చేదు పళ్ళు గంపలుగా కాయకు
    • వెర్రిగా చుక్కలంటి ఎదిగి విర్రవీగకు
    • అదిగో గొడ్డలి వేరున పదును పెట్టియున్నది