Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రండి సువార్త సునాదముతో - రంజిలు సిలువ నినాదముతో


    • రండి సువార్త సునాదముతో - రంజిలు సిలువ నినాదముతో
    • తంబుర సితార నాదముతో - ప్రభుయేసు దయానిధి సన్నిధికి

    • 1. యేసే మానవ జాతి వికాసం - యేసే మానవ నీతి విలాసం
    • యేసే పతిత పావన నామం - భాసుర క్రైస్తవ శుభనామం !!రండి!!

    • 2. యేసే దేవుని ప్రేమస్వరూపి - యేసే సర్వేశ్వర ప్రతిరూపం
    • యేసే ప్రజాపతి పరమేశం - ఆశ్రిత జనముల సుఖవాసం !!రండి!!

    • ౩. యేసే సిలువను మోసినదైవం - యేసే ఆత్మల శాశ్వత జీవం
    • యేసే క్షమాపణ అధికారం - దాసుల ప్రార్థన సహకారం !!రండి!!

    • 4. యేసే సంఘములో మనకాంతి - యేసే హృదయములో ఘనశాంతి
    • యేసే కుటుంబ జీవనజ్యోతి - పసిపాపల దీవెన మూర్తి !!రండి!!

    • 5. యేసే జీవన ముక్తికి మార్గం - యేసే భక్తుల భూతల స్వర్గం
    • యేసే ప్రపంచ శాంతికిసూత్రం - వాసిగనమ్మిన జనస్తోత్రం !!రండి!!