Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో - ఆత్మతో


    • సాగిలపడి మ్రొక్కెదము - సత్యముతో - ఆత్మతో
    • మన ప్రభుయేసుని ఆ....ఆ....ఆ.... !!సాగి!!

    • 1. మోషేకంటె శ్రేష్ఠుడు - అన్ని - మోసములనుండి - విడిపించున్
    • వేషధారులను ద్వేషించున్ - ఆశతో - మ్రొక్కెదము !!సాగి!!

    • 2. అహరోనుకంటె శ్రేష్ఠుడు - మన ఆరాధనకు పాత్రుండు
    • ఆయనే ప్రధాన యాజకుడు - అందరము - మ్రొక్కెదము !!సాగి!!

    • ౩. ఆలయముకన్న - శ్రేష్ఠుడు - నిజ ఆలయముగ తానే యుండెన్
    • ఆలయము మీరే యనెను - ఎల్లకాలము మ్రొక్కెదము !!సాగి!!

    • 4. యోనకంటె శ్రేష్ఠుడు - ప్రాణ - దానముగా తను అర్పించెన్
    • మానవులను విమోచించెన్ -ఘనపరచి మ్రొక్కెదము !!సాగి!!

    • 5. సొలొమోను కన్న శ్రేష్ఠుడు - సర్వజ్ఞనమునకు ఆధారుండు
    • పదివేలలో అతి ప్రియుండు - పదిలముగా మ్రొక్కెదము !!సాగి!!

    • 6. రాజులకంటె శ్రేష్ఠుడు - యాజకులనుగా మనలను చేసెన్
    • రారాజుగ త్వరలో వచ్చున్ - రయముగను మ్రొక్కెదము !!సాగి!!

    • 7. అందరిలో అతి శ్రేష్ఠుడు - మనకందరికీ తానే ప్రభువు
    • హల్లెలూయకు పాత్రుండు - అనుదినము మ్రొక్కెదము !!సాగి!! 

    • methotrexat grapefruit methotrexat folsyre methotrexat 7 5
  • Album: సీయోను గీతాలు, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 6899 times