Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

సిలువలో ఆ సిలువలో - ఆ ఘోర కల్వరిలో


    • సిలువలో ఆ సిలువలో - ఆ ఘోర కల్వరిలో
    • తులువల - మధ్యలో వ్రేలాడిన యేసయ్యా
    • వెలియైన యేసయ్యా - బలియైన యేసయ్యా
    • నిలువెల్ల నలిగితివా - నీవెంతో అలసితివా (2)

    • 1. నేరం చేయని నీవు - ఈ ఘోరపాపి కొరకు
    • భారమైన సిలువ - మోయలేక మోసావు (2)
    • కొరడాలు చెళ్ళిని చీల్చెనే - నీ సుందర దేహమునే
    • తడిపెను నీ తనువును - రుధిరంపు ధారలు !!వెలి!!

    • 2. వధకు సిద్దమైన - గొర్రెపిల్ల వోలె
    • మోమున ఉమ్మివేయ -మౌనివైనావే (2)
    • దూషించి అపహసించి - హింసించిరా నిన్ను
    • ఊహకు అందదు నీ త్యాగ యేసయ్యా !!వెలి!!

    • ౩. నాదు పాపమె నిన్ను - సిలువకు గురిచేసెన్
    • నాదు దోషమె నిన్ను - అణువణువున హింసించెన్
    • నీవు కార్చిన రక్తధారలే - నా రక్షణాధారం
    • సిలువను చేరెదన్ - విరిగిన హృదయముతోను !!వెలి!!