Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎందుకో నన్నింతగానీవు - ప్రేమించితివో దేవా


    • ఎందుకో నన్నింతగానీవు - ప్రేమించితివో దేవా
    • అందుకో నా దీన స్తుతిపాత్ర - హల్లెలూయ యేసయ్యా

    • 1. నాపాపము బాప - నరరూపివైనావు - నా శాపము మాప - నలిగి వ్రేలాడితివి
    • నాకు చాలిన దేవుడవు నీవే - నా స్థానములో నీవే !!ఎందుకో!!

    • 2. నీ రూపము నాలో - నిర్మించి యున్నావు - నీ పోలికలోనే - నివసించుమన్నావు
    • నీవు నన్ను ఎన్నుకొన్నావు నీ కొరకై నీ కృపలో !!ఎందుకో!!

    • ౩. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
    • నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
    • నన్ను నీలో చేర్చుకొన్నావు నన్ను దాచి యున్నావు !!ఎందుకో!!

    • 4.నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
    • నీ సంపద నాలో నా సంతసము నీలో
    • నీవు నేను ఏకమగు వరకు నను విడువనంటివే !!ఎందుకో!!