Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఇదిగో దేవా నా జీవితం ఆపాద మస్తకం


    • ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం
    • శరణం నీ చరణం - శరణం నీ చరణం (2)

    • 1.పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి
    • విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి
    • అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు
    • అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం

    • 2. నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
    • నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయనిమ్ము
    • ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము
    • ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము

    • 3. విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము
    • కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు
    • క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా
    • నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా

    • methotrexat grapefruit methotrexat folsyre methotrexat 7 5