Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా - Vachchindi Vachchindi Vachchindi Christmas Pandugaa


    • వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా
    • మార్పులేకుండ చేస్తే శుద్ద దండగా
    • వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ
    • యేసయ్య కోరింది మనలో మార్పునే కదా
    • ఇంటికి రంగులు కాదు – వంటికి హంగులు కాదు
    • అల్లరి ఆటలు కాదు – త్రాగుబోతు విందులు కాదు (2)
    • మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్
    • అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్
    • దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్
    • ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్      ||వచ్చింది||

    • రంగురంగు వస్త్రాలు – మురికిగుడ్డల మనస్సులు
    • మెరిసిపోతున్న ఇళ్ళు – మాసిపోయాయి హృదయాలు
    • ఇంటిపైన నక్షత్రాలు – ఇంటిలో మద్యపానులు
    • పేరుకేమో క్రైస్తవులు – తీరుమారని జనులు (2)      ||ఇంటికి||

    • విద్యలేని పామరులు – విధేయులై బ్రతికారు
    • విద్యవున్న సోమరులు – మందిరాలకే రారు
    • తూర్పుదేశపు జ్ఞానులే – మోకాళ్ళు వంచినారు
    • చదువు పదవుంటే చాలు – మోకరించరు వీరు (2)      ||ఇంటికి||

    • దినములు చెడ్డవి గనుక – సమయమును పోనియ్యక
    • అజ్ఞానులవలె కాక – జ్ఞానులవలె నడవాలి
    • పాపము తీయుట కొరకే – ప్రభు పుట్టాడని తెలిసి
    • పాపము వీడక నీవు – ఉత్సవ ఉల్లాసాలా (2)      ||ఇంటికి||

    • Vachchindi Vachchindi Vachchindi Christmas Pandugaa
    • Maarpu Lekunda Chesthe Shuddha Dandagaa
    • Vachchindi Vachchindi Vachchindi Christmas Pandugaa
    • Yesayya Korindi Manalo Maarpune Kadaa
    • Intiki Rangulu Kaadu – Vantiki Hangulu Kaadu
    • Allari Aatalu Kaadu – Thraagubothu Vindulu Kaadu (2)
    • Maaru Manassu Kaligundutaye Christmas
    • Apavathrithathanu Visarjinchute Christmas
    • Daiva Prema Kaligundutaye Christmas
    • Prabhuvu Koraku Jeevinchutaye Nija Christmas      ||Vachchindi||

    • Rangu Rangu Vasthraalu – Muriki Guddala Manassulu
    • Merisipothunna Illu – Maasipoyaayi Hrudayaalu
    • Intipaina Nakshathraalu – Intilo Madyapaanaalu
    • Perukemo Kraisthavulu – Theeru Maarani Janulu (2)     ||Intiki||

    • Vidya Leni Paamarulu – Vidheyulai Brathikaaru
    • Vidya Unna Somarulu – Mandiraalake Raaru
    • Thoorpu Deshapu Gnaanule – Mokaallu Vanchinaaru
    • Chaduvu Padavunte Chaalu – Mokarincharu Veeru (2)     ||Intiki||

    • Dinamulu Cheddavi Ganuka – Samayamunu Poniyyaka
    • Agnaanula Vale Kaaka – Gnaanula Vale Nadavaali
    • Paapamu Theeyuta Korake – Prabhu Puttaadani Thelisi
    • Paapamu Veedaka Neevu – Uthsava Ullaasaalaa (2)     ||Intiki||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 269 times