Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

రారే మన యేసు స్వామిని - Raare Mana Yesu Swaamini


    • రారే మన యేసు స్వామిని
    • జూతము కోర్కె – లూర ప్రియులారా పేర్మిని
    • గూరిమి భక్తుల జేరువ విందట
    • భూరిద యామృత సారము లొలికెడు
    • చారు కటాక్ష వి – శాలేక్షనుడట
    • నారకులగు నర – నారీ జనులకు
    • దారక మొసగను దానే పిలుచునట
    • దారుణ పాప మ-హారణ్యమునకు
    • గారు చిచ్చు గతి గన్పడువాడట
    • ఘోర దరిద్రత గూల్చెడి వాడట
    • సారంబగు తన సభకు మకుటమాట         ||రారే||

    • పతిత పావనమౌ వేల్పట
    • అనాది దేవ సుతుడై – ఇల జేరినాడట
    • సతతము కడు దురి – తతమోయుతమగు
    • ప్రతి దేశమునకు – హిత భాస్కరుడట
    • అతులిత మోక్షో – న్నత గుణగణుడట
    • కుతలంబున స-ద్గతి రహితంబగు
    • పతితుల గావను – మృతుడైనాడట
    • అతి పుణ్య తను – క్షత శోణితమును
    • వ్రతముగ సిలువను నతఁడొసంగెనట
    • మృతిని జయించుచు బ్రతికి లేచెనట
    • మతి నమ్మిన మన గతి యితడేనట          ||రారే||

    • తుదలేని మహిమ వాడట
    • తను గొల్చు సాధు – హృదయుల సొమ్ము మూటట
    • చెదరిన గొర్రెల – వెదక వచ్చెనట
    • చిదురుపలగు జన హృదయములన్నిట
    • బదిలముగా నె-మ్మది నిడువాడట
    • నదితట మఠ జన వదనముల స
    • మ్మద శుభవార్తను – బలికినవాడట
    • సదయత సంధుల – కక్షుల నిడెనట
    • వెదకి బధిరులకు – వీనులొసగె నట
    • సదమల మోక్ష ప్రభుడగు విభుడట
    • యిదిగో మనకిత డేలినవాడట       ||రారే||

    • Raare Mana Yesu Swaamini
    • Joothamu Korke – Loora Priyulaaraa Permini
    • Goorimi Bhakthula Jeruva Vindata
    • Bhoorida Yaamrutha Saaramu Lolikedu
    • Chaaru Kataaksha Vi – shaalekshanudata
    • Naarakulagu Nara – Naaree Janulaku
    • Daaraka Mosaganu Daane Pilachunata
    • Daaruna Paapa Ma-haaranyamunaku
    • Gaaru Chichchu Gathi Ganpaduvaadata
    • Ghora Daridratha Goolchedi Vaadata
    • Saarambagu Thana Sabhaku Makutamata         ||Raare||

    • Pathitha Paavanamou Velpata
    • Anaadi Deva Suthudai – Ila Jerinaadata
    • Sathathamu Kadu Duri – Thathamoyuthamagu
    • Prathi Deshamunaku – Hitha Bhaaskarudata
    • Athulitha Moksho – nnatha Gunaganudata
    • Kuthalambuna Sa-dgathi Rahithambagu
    • Pathithula Gaavanu – Mruthudainaadata
    • Athi Punya Thanu – Kshatha Shonithamunu
    • Vrathamuga Siluvanu Nathadosangenata
    • Mruthini Jayinchuchu Brathiki Lechenata
    • Mathi Nammina Mana Gathi Yithadenata         ||Raare||

    • Thudaleni Mahima Vaadata
    • Thanu Golchu Saadhu – Hrudayula Sommu Mootata
    • Chedarina Gorrela – Vedaka Vachchenata
    • Chidurupalagu Jana Hrudayamulannita
    • Badilamugaa Ne-mmadi Niduvaadata
    • Nadithata Mata Jana Vadanamula Sa
    • mmada Shubhavaarthanu – Balikinavaadata
    • Sadayatha Sandhula – Kakshula Nidenata
    • Vedaki Badhirulaku – Veenulosage Nata
    • Sadamala Moksha Prabhudagu Vibhudata
    • Yidigo Manakitha Delinavaadata        ||Raare||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 532 times