Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు - Prema Lenivaadu Paralokaaniki Anarhudu


  • ప్రేమ లేనివాడు పరలోకానికి అనర్హుడు
  • ప్రేమించలేని నాడు – తన సహోదరుని ద్వేషించే నరహంతకుడు (2)
  • ప్రేమ నేర్పించాలని నిన్ను – ఈ లోకానికి పంపించెను ఆ దేవుడు
  • ప్రేమ చూపించాలని నీకు – తన ప్రాణాన్ని అర్పించెను ప్రియ కుమారుడు
  • ప్రేమే జీవన వేదం – ప్రేమే సృష్టికి మూలం
  • ప్రేమే జగతికి దీపం – ప్రేమలోనే నిత్య జీవితం
  • ప్రేమే అంతిమ తీరం – ప్రేమే వాక్యపు సారం
  • ప్రేమే సత్య స్వరూపం – ప్రేమ ఒకటే నిలుచు శాశ్వతం         ||ప్రేమ లేనివాడు||

  • మంచి వాని కొరకు సహితము – ఒకడు మరణించుట అరుదు
  • పాపులకై ప్రాణమిచ్చిన – ప్రేమకు కట్టలేము ఖరీదు
  • ద్రోహియైన యూదానే ఆయన – కడవరకు విడువలేదు
  • అప్పగించువాడని తెలిసి – బయటకు నెట్టివేయలేదు
  • దొంగ అని తెలిసే ఉద్యోగం ఇచ్చాడురా
  • ధనము సంచి యూదా దగ్గరనే ఉంచాడురా
  • వెండి కొరకు తనను అమ్ముకోకూడదనేరా
  • చివరి వరకు వాడిని మార్చాలని చూసాడురా
  • ఇంత గొప్ప క్రీస్తు ప్రేమ కలిగియున్నవాడే
  • నిజ క్రైస్తవుడౌతాడురా
  • ప్రేమే దేవుని రూపం – ప్రేమే క్రీస్తు స్వరూపం
  • ప్రేమే కడిగెను పాపం – ప్రేమ జీవ నదీ ప్రవాహం       ||ప్రేమ లేనివాడు||

  • కాలు ఎదిగిపోతుందని – ఓర్వలేక కన్ను బాధపడదు
  • కంటిలోని నలుసు పడితే – సంబరంతో కాలు నాట్యమాడదు
  • చేయి లేచి చెవిని నరుకదు – పేగు గుండెను ఉరి తీయదు
  • వేలు తెగితే నోరు నవ్వదు – అసూయ అవయవాలకుండదు
  • సంఘమంటే యేసు క్రీస్తు శరీరమే సోదరా
  • మీరంతా అవయవాలు అతికి ఉండాలిరా
  • ఏ భాగం పాటుపడిన శిరస్సుకే మహిమరా
  • ఈ భావం బాధపడితే అభ్యంతర పరచకురా
  • ఇంత గొప్ప దైవ ప్రేమ కనుపరచిననాడే
  • క్రీస్తు నీలో ఉంటాడురా
  • ప్రేమే ఆత్మకు ఫలము – ప్రేమే తరగని ధనము
  • ప్రేమే పరముకు మార్గము – ప్రేమ వరము నిత్యజీవము           ||ప్రేమ లేనివాడు||

  • ఎంత గొప్పవాడైనా ప్రేమ లేకపోతే – లేదు ఏ ప్రయోజనం
  • ఎంత సేవ చేస్తున్నా ప్రేమ చూపకుంటే – గణ గణలాడే తాళం
  • వర్గాలుగా విడిపోయి విభజన చేస్తామంటే – ఒప్పుకోదు వాక్యం
  • పౌలెవరు పేతురెవరు పరిచారకులే కదా – క్రీస్తు యేసు ముఖ్యం
  • మారాలని మార్చాలని కోరేది ప్రేమరా
  • నిన్ను వలె నీ సహోదరులను ప్రేమించరా
  • ప్రేమించే వారినే ప్రేమిస్తే ఏం గొప్పరా
  • శత్రువులను సైతం ప్రేమించమన్నాడురా
  • ప్రేమ పొడవు లోతు ఎత్తు గ్రహియించినవాడే
  • పరలోకం వెళతాడురా
  • స్వార్ధ్యం లేనిది ప్రేమ – అన్నీ ఓర్చును ప్రేమ
  • డంభం లేనిది ప్రేమ – అపకారములే మరచును ప్రేమ
  • ఉప్పొంగని గుణమే ప్రేమ – కోపం నిలుపదు ప్రేమ
  • అన్నీ తాలును ప్రేమ – మత్సరమే పడనిది ప్రేమ
  • దయనే చూపును ప్రేమ – దరికే చేర్చును ప్రేమ
  • సహనం చూపును ప్రేమ – నిరీక్షణతో నిలుచును ప్రేమ
  • క్షమనే కోరును ప్రేమ – ద్వేషం చూపదు ప్రేమ
  • ప్రాణం నిచ్చిన ప్రేమ – దోషములే కప్పును ప్రేమ

  • Prema Lenivaadu Paralokaaniki Anarhudu
  • Preminchaleni Naadu – Thana Sahodaruni Dweshinche Nara Hanthakudu (2)
  • Prema Nerpinchaalani Ninnu – Ee Lokaaniki Pampinchenu Aa Devudu
  • Prema Choopinchaalani Neeku – Thana Praanaanni Arpinchenu Priya Kumaarudu
  • Preme Jeevana Vedam – Preme Srushtiki Moolam
  • Preme Jagathiki Deepam – Premalone Nithya Jeevitham
  • Preme Anthima Theeram – Preme Vaakyapu Saaram
  • Preme Sathya Swaroopam – Prema Okate Nilachu Shaashwatham         ||Prema Lenivaadu||

  • Manchi Vaani Koraku Sahithamu – Okadu Maraninchuta Arudu
  • Paapulakai Praanamichchina – Premaku Kattalemu Khareedu
  • Drohiyaina Yoodaane Aayana – Kadavaraku Viduvaledu
  • Appaginchuvaadani Thelisi – Bayataku Nettiveyaledu
  • Donga Ani Thelise Udyogam Ichchaaduraa
  • Dhanamu Sanchi Yoodaa Daggarane Unchaaduraa
  • Vendi Koraku Thananu Ammukokoodadaneraa
  • Chivari Varaku Vaadini Maarchaalani Choosaaduraa
  • Intha Goppa Kreesthu Prema Kaligiyunnavaade
  • Nija Kraisthavudauthaaduraa
  • Preme Devuni Roopam – Preme Kreesthu Swaroopam
  • Preme Kadigenu Paapam – Prema Jeeva Nadee Pravaaham         ||Prema Lenivaadu||

  • Kaalu Edigipothundani – Orvaleka Kannu Baadhapadadu
  • Kantilona Nalusu Padithe – Sambaramtho Kaalu Naatyamaadadu
  • Cheyi Lechi Chevini Narukadu – Pegu Gundenu Uri Theeyadu
  • Velu Thegithe Noru Navvadu – Asooya Avayavaalakundadu
  • Sanghamante Yesu Kreesthu Shareerame Sodaraa
  • Meeranthaa Avayavaalu Athiki Undaaliraa
  • Ae Bhaagam Paatupadina Shirassuke Mahimaraa
  • Ee Bhaavam Bodhapadithe Abhyanthara Parachakuraa
  • Intha Goppa Daiva Prema Kanuparachinanaade
  • Kreesthu Neelo Untaaduraa
  • Preme Aathmaku Phalamu – Preme Tharagani Dhanamu
  • Preme Paramuku Maargamu – Prema Varamu Nithyajeevamu         ||Prema Lenivaadu||

  • Entha Goppavaadainaa Prema Lekapothe – Ledu Ae Prayojanam
  • Entha Seva Chesthunnaa Prema Choopakunte – Gana Ganalaade Thaalam
  • Vargaaluga Vidipoyu Vibhajana Chesthaamante – Oppukodu Vaakyam
  • Paulevaru Pethurevaru Parichaarakule Kadaa – Kreesthu Yesu Mukhyam
  • Maaraalani Maarchaalani Koredi Premaraa
  • Ninnu Vale Nee Sahodarulanu Premincharaa
  • Preminche Vaarine Premisthe Em Gopparaa
  • Shathruvulanu Saitham Preminchamannaaduraa
  • Prema Podavu Lothu Etthu Grahiyinchinvaade
  • Paralokam Velathaaduraa
  • Swaardhyam Lenidi Prema – Annee Orchunu Prema
  • Dambam Lenidi Prema – Apakaaramule Marachunu Prema
  • Uppongani Guname Prema – Kopam Nikupadu Prema
  • Annee Thaalunu Prema – Mathsarame Padanidi Prema
  • Dayane Choopunu Prema – Darike Cherchunu Prema
  • Sahanam Choopunu Prema – Nireekshanatho Niluchunu Prema
  • Kshamane Korunu Prema – Dwesham Choopadu Prema
  • Praanam Nichchina Prema – Doshamule Kappunu Prema
 • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1255 times